మహర్షి వాల్మీకి రచించిన రామాయణ కథను ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు. శ్రీ రామ పట్టాభిషేకం తో రచన పరిసమాప్తి చేయబోతున్నమహర్షికి "రామాయణం ఇంకా ఉంటే బాగుండు"ననే శిష్యుల మాట ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది. ఎందుకిలా వారు అన్నారో అని అనుకునే వాల్మీకికి ఆ మాటలు జరగబోయే భవిష్యత్తును సూచిస్తున్నట్లు తోచి, తన పాత్ర పూర్తి కాలేదని గ్రహిస్తాడు. అదే ఆయన కనులముందర కదలాడిన ఉత్తర రామాయణం అనే లవకుశుల గాథ. ఈ ఉత్తర రామాయణం లవకుశ పేరుతో 1934 లోను, 1963 లోను, తరువాత ఇటీవల 2012 లో శ్రీరామరాజ్యం పేర్లతో విడుదల అయ్యాయి. 1963 లో లలితా శివజ్యోతి పతాకం పై విడుదలయిన లవకుశ ఎన్నో రికార్డులను అధికమించి అత్యంత ప్రజాదరణ పొందిందంటే దానికి తెరపై అసాధారణ ప్రతిభను చూపిన నటీనటులు, తెరవెనుక నేపథ్యంలో ఉండే సముద్రాల రాఘవాచార్యులవంటి సాహితీ కోవిదులు, సంగీత జలనిధియైన ఘంటసాల స్వరకల్పన, మాస్టారితో పాటు మధురగళాలను కలిపిన పి.లీల, పి.సుశీల తదితర మేటి గాయక సహచరులు మరియు ఇతర సాంకేతిక నిపుణులు ముఖ్య కారణం. తిలకించండి ఈ రమణీయ కావ్యం.
లలితా శివ జ్యోతి వారి
లవకుశ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: ఈ బ్లాగు యొక్క మెంబర్ మాత్రమే కామెంట్‌ను పోస్ట్ చెయ్యగలరు.